బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అంశంపై…బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ లో brs విలీనం అనేది శుద్ధ అబద్ధమన్నారు. బీజేపీ లో అలాంటి చర్చ లేదని తెలిపారు. BRS నేతలు ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో …. దాన్ని బట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించిందని… పూర్తి స్థాయి లో రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయలేదు.
ప్రజల్ని రైతుల్ని సీఎం మోసం చేశారని ఆగ్రహించారు. హైడ్రా పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అడ్డగోలుగా కూలగొట్టి అధికారం వారికి ఎవరు ఇచ్చారు… FTL పరిధిలో ఉన్న భూములు ప్రభుత్వ భూములు కాదు.. అవి రైతులకు సంబంధించినవి అని చెప్పారు. అప్పట్లో ఎందుకు నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు… ఇక పై నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని తెలిపారు. ORR లోపల ప్రాంతాల విలీనం అనేది ఏదో గీతలు గీసినట్టు ఉండకూడదు… అన్ని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ గ్రాఫ్ ఏమీ పడిపోలేదు… ఒక్కో సారి ఒక్కోలా ఉంటుందని తెలిపారు.