హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడు – ఈటల రాజేందర్

హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడని సీరియస్‌ అయ్యారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులకు ఘనస్వాగతం పలికి, సన్మానించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉంది,పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలిసి పనిచేసుకునే పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజూరాబాద్ అన్నారు.

అధికారం ఎవరీ శాశ్వతం కాదు, బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త,చిల్లర వేశాలు మాని,ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనస్సు గెలువాలి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసులకు భయపడరని హెచ్చరించారు. నా నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడు.అందుకే చాలా మందికి హుజూరాబాద్ లో లైసెన్స్ తుపాకులు ఇచ్చారు.పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తోత్తులుగా మారారని,మా నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.