నేను సీఎం అభ్యర్థిని కాదు : ఈటల

తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ ఖండించారు. భాజపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పదవులు.. వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని వివరించారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్‌ అంటూ పలు పత్రికలు, ఛానళ్లు, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టు చెప్పారు.  తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన అంతమే తన లక్ష్యమని పేర్కొన్నారు.  కాషాయ జెండాను ఈ గడ్డ మీద ఎగరేయడం కోసం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఈటల రాజేందర్‌ తెలిపారు.

కాషాయ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగరవేయడమే ధ్యేయమని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతమొందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. భాజపా ఏ బాధ్యత ఇస్తే దానిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఈటల వెల్లడించారు.