ఇంత జరుగుతున్నా కేటీఆర్ స్పందించలేదు : మంత్రి కొండా సురేఖ

-

సోషల్ మీడియాలో తనను కించపరిచేలా ట్రోలింగ్ చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బాపూఘాట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్ లు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ట్రోలింగ్ విషయంలో ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి నాకు మద్దతుగా నిలిచారని వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. 

ఈ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారన్నారు. కానీ దానికి దీనికి ట్వీట్స్ చేసే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వారి పార్టీకి చెందిన వారు మహిళలను కించపరుస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మా పార్టీ తరపున ఇది జరిగిందని క్షమాపణలు కోరి భవిష్యత్ లో ఇలాంటివి జరుగకుండా చూసుకుంటామని చెప్పకపోవడం కేటీఆర్ వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. తాను ఐదేళ్లు బీఆర్ఎస్ లో పని చేశానని నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news