సాధారణంగా ఏదైనా పండుగల సందర్భంలో వైన్ షాపులు బంద్ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గాంధీ జయంతి, వినాయకనిమజ్జనం, శ్రీరామనవమి వంటి పండుగలతో పాటు ఎన్నికల వేళ వైన్ షాపులు బంద్ చేస్తుంటారు. అలాగే ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను బంద్ చేయనున్నారు.
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా జంట నగరాల్లో వైన్ షాప్స్ మూసి వేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్, కల్లు, దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు సైతం బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్టు సమాచారం. వేసవి కాలం కావడంతో మందు బాబు ఈనెల 16 వైన్ షాపుల ముందు బారులు తీరే అవకాశముంది.