రేవంత్ వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు – రఘునందన్ రావు

రేవంత్ రెడ్డి వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని అన్నారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాజకీయాల్లో విలువలకు, వలువలకు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. టిడిపిలో గెలిచి పార్టీ మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు. రేవంత్ ఎందుకు పార్టీ మారారు? ఏ వ్యాపారాల కోసం పార్టీ మారారు? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు.. గల్లీలో రాదన్నారు రఘునందన్ రావు. రేవంత్ ఎవరి ఏజెంటో అందరికీ తెలుసన్నారు. నానానికి బొమ్మ, బొరుసులు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలని అన్నారు. ఓటుకు నోటు కేసులో పట్ట పగలు దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ రెడ్డి బూతులు మానకపోతే తగిన గుణపాఠం చెబుతామన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.