కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని విషయాలు బయటకొస్తాయి : జస్టీస్ చంద్రఘోష్

-

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వెరీ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రఘోష్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రారంభం అయిందని.. ఇప్పటికే ఒకసారి ప్రాజెక్టను విజిట్ చేశామని తెలిపారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏడుగురికి నోటీసులు ఇచ్చామని.. రేపు దర్యాప్తుకు రావాలని మరో 18 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి 54 ఫిర్యాదులు వచ్చాయని.. అన్ని ఫిర్యాదులను విచారిస్తామన్నారు. నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా వచ్చాయని వెల్లడించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.

జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదని.. ఇంకా సమయం పడుతుందని తేల్చి చెప్పారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని అన్నారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండటంతో విచారణ కొంత ఆలస్యం అయ్యిందని.. ఇప్పుడు దర్యాప్తు వేగంగా జరుగుతోందని తెలిపారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, రెగ్యూలర్, ఆర్థిక, అంశాలపై విచారణ మొదలు అవుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news