లవర్స్ కోసం బెస్ట్‌ పెన్‌.. ఇక గోడలపై, చెట్లపై ఈజీగా ఈ పెన్నుతో రాసేయొచ్చు..!!

-

మనం ఏదైనా పార్క్‌కు కానీ, టూరిస్ట్‌ ప్లేసులకు వెళ్తే అక్కడ గోడలపై, చెట్లపై లవర్స్‌ పేర్లు ఉంటాయి. శివ లవ్‌ శృతి, శ్రీను లవ్‌ రేవతి ఇలా వాళ్లు వాళ్ల ప్రేయసి పేరును తెగ చెక్కేస్తుంటారు. ఆఖరికి తిరుమల స్టెప్ప్స్‌ పై వెళ్లేప్పుడు కూడా ఆ గోడలపైన కూడా తెగ రాసేశారు. ఇలా ప్రేమను చాటుకోవడానికి ప్రేమికులు ఇలాంటి మార్గాలను బాగా ఎంచుకుంటారు. అయితే సాధారణంగా చెట్లపై పేర్లు చెక్కడం అంటే చాలా కష్టం, గోడలపై బొగ్గుతో గీకేస్తారు. కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక క్రియేటివ్‌ పెన్ను ఉంది. ఇక దీంతో మీరు చెక్కపైన, మెటల్‌పైన, నగలపైన కూడా హ్యాపీగా మీ పేరును, మీ ప్రియమైన వారి పేరును రాసుకోవచ్చు. ఈ పెన్‌ అసలు లవర్స్‌ కోసమే చేశారా అన్నట్లు వారికి మాత్రం సూపర్‌గా ఉపయోగపడుతుంది.

ఈ పెన్ ఎలా పనిచేస్తుందో, ధర ఎంతో, వివరాలు తెలుసుకుందాం.

ఇది FreshDcart బ్రాండ్ నుంచి వచ్చిన పవర్ ఎంగ్రేవింగ్ పెన్. దీని ద్వారా కలప, గ్లాస్ వంటి వాటిపై పేర్లను, డిజైన్లను చెక్కవచ్చు. నగలు, గ్లాస్‌పై చెక్కేందుకు వీలుగా ఎక్స్‌ట్రా టూల్ నిబ్ ఇస్తున్నారు. చైనాలో తయారైన ఈ పెన్ బరువు 100 గ్రాములు, పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు ఉంటుందని తెలిపారు.

ఈ పెన్ వాడేముందు వెనకవైపు నుంచి తిప్పి బోటమ్ పార్ట్‌ని ఊడదియ్యాలి. AA సైజ్ బ్యాటరీలను వెయ్యాలి. మూతపెట్టేయాలి. (ఈ బ్యాటరీలు విడిగా కొనుక్కోవాలి). మనం పెన్నుని ఎలా పట్టుకుంటామో అలాగే ఇది కూడా పట్టుకోవాలి. బొటనవేలి దగ్గర చిన్న కంట్రోల్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కడం ద్వారా పెన్ పనిచేస్తుంది.

బొటనవేలితో కంట్రోల్ బటన్‌ని నొక్కి, కొద్దిగా ఒత్తిడి చెయ్యగానే.. పెన్ చెక్కడం మొదలుపెడుతుంది. కావాల్సిన విధంగా చెక్కుకోవాలి. ఆ తర్వాత బోటనవేలును తీసేస్తే.. పెన్ పనిచేయడం ఆగిపోతుంది.ఎవరికైనా గిఫ్టుగా ఇచ్చేందుకు ఈ పెన్ బాగుంటుంది. దీనితో వాళ్లు ఏది చెక్కినా మీరే గుర్తొస్తారు.

ఈ పెన్నుతో కలప, గ్లాస్, ఇతర పాత్రలపై చెక్కడం ద్వారా మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్తగా ఏదో నేర్చుకున్న ఫీల్ కలుగుతుంది. లవర్స్ ఏదైనా గిఫ్టుగా ఇచ్చుకునేటప్పుడు.. పేర్లను ఈ పెన్నుతో చెక్కి ఇస్తే.. ఆ టాలెంట్ అవతలివారికి ఎప్పటికీ గుర్తుంటుంది.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, కాలిక్యులేటర్స్, మాగ్నిఫైయింగ్ గ్లాసెస్, పెన్స్, మెటల్స్, జువెలరీపై కూడా ఈ పెన్‌తో చెక్కవచ్చని తెలిపారు. ఎవరికైనా ట్రోఫీలు, మెడల్స్ ఇచ్చేటప్పుడు ఈ పెన్నుతో పేర్లు చెక్కి ఇస్తే.. లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతుంది. దీని అసలు ధర రూ.499 కాగా.. అమెజాన్‌లో దీనిపై 50 శాతం డిస్కౌంట్ ఉంది. రూ.249కి అమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news