ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకు అంటే..?

-

తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్సెట్ 2024కు సంబంధించిన మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బీఈడీ కోర్సులో అడ్మిషన్ పొందాడానికి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు.

ఈ క్రమంలోనే ఎడ్సెట్-2024 దరఖాస్తు గడువు పొడిగించారు. ఎలాంటి అదనపు ఫీజు లేకుండా మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ మృణాళిని ఓ ప్రకటనలో తెలిపారు. రూ.250 లేట్ ఫీజుతో మే 23న సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం https:Edcet.tsche.ac.in వెబ్ సైట్ ని  సందర్శించండి.

Read more RELATED
Recommended to you

Latest news