గుడ్ న్యూస్ : హైద‌రాబాద్ లో ఉచిత తాగునీటి ప‌థ‌కం గ‌డువు పెంపు

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు జీహెచ్ఎంసీ శుభ‌వార్త తెలిపింది. న‌గ‌రం లో ఇప్ప‌టి వ‌ర‌కు అందించి ఉచిత మంచి నీటి ప‌థ‌కం గ‌డువు ను ఈ నెల 31 వ‌ర‌కు పొడ‌గించారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ జారీ చేశారు. కాగ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో 20 వేల లీట‌ర్ల ఉచిత మంచి నీటిని అందించే ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. అలాగే జ‌న‌వ‌రి 12న మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌కటించారు.

కాగ ఈ ప‌థ‌కాన్ని ఈ నెల 31 వ‌ర‌కు ఉచితం గా అంద‌జేయ‌నున్నారు. దీని త‌ర్వాత అంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ప్ర‌తి ఇంటి కి నీటి కి సంబంధించి బిల్లు వ‌స్తుంది. అయితే నెల 20 వేల లీట‌ర్ల నీటిని వినియోగించుకుంటే ఎలాంటి బిల్లు ఉండ‌దు. కానీ నెల కు 20 వేల లీట‌ర్లు కు మించి నీటి ని వాడితే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా విడుద‌ల చేశారు.