మంచు విష్ణుపై తప్పుడు వీడియోలు.. యాక్టర్ శివబాలాజీ ఫిర్యాదు!

-

‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన ప్రొడక్షన్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు యాక్టర్ ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణు, ఆయన సంస్థకు వ్యతిరేకంగా, అవమానకరంగా వీడియో క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ చంద్రహాస్ దేవరకొండ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు.

అయితే, తన చానల్‌ను పాపులర్ చేసుకునేందుకు ఇలాంటి తప్పుడు, కల్పిత వీడియోలు చేస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.కాగా, మంచు విష్ణు ఫిర్యాదుతో ఇటీవల పలు యూట్యూబ్ చానళ్లు మూతబడిన విషయం తెలిసిందే. సినీ నటీనటులపై అసభ్య, అభ్యంతరకరంగా వీడియోలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న ఫిర్యాదుతో వాటిపై వేటు పడింది.తీరు మార్చుకోకుంటే మరికొన్ని చానళ్లపైనా ఫిర్యాదు చేస్తామని మంచు విష్ణు హెచ్చరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news