జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నిన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాాజాగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక నాయకులకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఫిరోజ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింపతీ ఉంది.
స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనడం మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. టికెట్ ఎవరికీ ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. జూబ్లీహిల్స్ లో పార్టీ పోటీ చేస్తుంది. ఒక వ్యక్తి పోటీ చేయడు అని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అన్నారు. అంతేకాదు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ లో పుట్టి పెరిగారా? వాళ్ళెందుకు వయనాడ్ లో పోటీ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.