టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ చేపడుతోంది. Jungle Rummy బెట్టింగ్ యాప్ ను ప్రకాశ్ రాజ్ ప్రమోట్ చేశారు. దీంతో అతని పై FIR కూడా నమోదు అయింది. వాస్తవానికి 2016 జూన్ లో ఓ యాడ్ చేశానని.. ఏడాది పాటు చేసుకున్న అగ్రిమెంట్ అని ఇటీవల ప్రకాశ్ రాజ్ మీడియాకి వెల్లడించారు.
ఇక ఆ తరువాత తన తప్పును తెలుసుకొని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ తెలిపాడు. తొమ్మిదేళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందం చేసుకొని యాడ్ చేసాను. అయితే 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మింది. అయితే సోషల్ మీడియాలో తన ప్రకటనను వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు కూడా పంపించాను. ఈడీ విచారణకు హాజరై వివరాలను వెల్లడిస్తానని ప్రకాశ్ రాజ్ మీడియాకు తెలిపారు. 10రోజుల కిందటే ఈడీ విచారణకు హాజరు కావాలని ప్రకాశ్ రాజ్ కి నోటీసు పంపించింది.