50 మంది హాస్టల్ విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్.. ఆరుగురి పరిస్థితి విషమం..!

-

సాధారణంగా ప్రస్తుతం చదువుకు మార్కెట్ మంచి గిరాకీ ఉంది. ఉన్నత చదువులు చదువుకుంటే భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా హాస్టల్స్ లో ఉంచి చదివిస్తుంటారు. ఇలా  ఎందరో విద్యార్థులు తాము ఉన్న ఊరికి, కన్నవారికి దూరమై హాస్టల్స్ లో ఉండి ఉన్నత చదువులు చదువుకుంటున్నారు.  కొన్ని హాస్టల్స్ లో నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణికి ఆశయాల బాటలో అడుగులు వేయాల్సిన విద్యార్థులు అనారోగ్యంతో అసుపత్రుల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.

తాజాగా అలాంటి ఘటనే చందానగర్ లోని సుమన్ హాస్టల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ లోని మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు చందానగర్ లోని సుమన్ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. తాజాగా హాస్టల్ లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. 50 మందికి వాంతులు, విరోచనాలు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. కాగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news