గ్రేహండ్స్‌ కానిస్టేబుల్‌ మృతికి సంతాపం తెలిపిన అటవీశాఖ మంత్రి

-

మహదేవ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణులను బిగించిన కరెంటు తీగలు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాలని చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్ ఎంసీ పర్గెయిన్‌ను మంత్రి ఆదేశించారు. జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను సేకరించి గ్రేహౌండ్స్‌తో పాటు స్థానిక పోలీసు అధికారులకు అందించాలని మంత్రి సూచించారు. తద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వన్యప్రాణులను వేటాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news