తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ.. కామారెడ్డి నుంచి ఓడిపోయారు. కేసీఆర్ తో పాటు చాలా మంది బీఆర్ఎస్ కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. కేసీఆర్ ఇటీవలే ఫామ్ హౌస్ లోని బాత్ రూమ్ లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగిపోయిన విషయం తెలిసిందే.
యశోద ఆసుపత్రికి సర్జరీ చేయించుకొని నందినగర్ లోని తన నివాసంలో ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. వంటిమామిడి లో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ కి విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు. పది రోజుల్లో ఫామ్ హౌస్ కి వస్తానని వ్యవసాయం చూసుకుంటానన్నారు BRS అధినేత కేసీఆర్. ఆరోగ్యం గురించి వాకబు చేయగా ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. గత నెల డిసెంబర్ 8న ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డాడు మాజీ సీఎం. తుంటి ఎముక సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్.