తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు హరీష్ రావు. సిద్ధిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలంలో అకాల వర్షానికి నష్టపోయిన మామిడి తోటలను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు… అనంతరం మాట్లాడారు. ద్దిపేట నియోజకవర్గంలో 1,800 ఎకరాలలో మామిడి పంట నష్టం జరిగింది.. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, రెవెన్యూ శాఖ, అధికారులు ఎన్యూమరేషన్ చేసి తక్షణమే సహాయం అందించాలన్నారు.

రైతులు ఇప్పటికే పంట నష్టపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నానని.. ముఖ్యంగా పండ్ల తోటలు, మామిడి తోట రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. తీవ్రమైన గాలితో కూడిన వర్షం రావడం వల్ల మామిడి పంట 1,800 ఎకరాల్లో నష్టపోయిందన్నారు హరీష్ రావు.