టిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

టిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు అశ్వారావుపేట మాజీ ఎం ఎల్ ఏ తాటి వెంకేటేశ్వర్ రావు, కరకగూడెం జడ్పీటీసీ కాంతరావు. ఇవాళ మధ్యానం 12 గంటలకు కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. నిన్న విజయరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవల కేటీఆర్ కంటే నేనే సీనియర్ అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ పార్టీలో కుట్ర జరుగుతోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపణలు గుప్పించారు. ఉద్దేశ్య పూర్వకం గానే తనను పక్కన పెడుతున్నారని విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కంటే నేనే సీనియర్ ని అని వ్యాఖ్యానించారు.