ఫ్రెండ్ అని పెళ్లికి వెళితే.. పెళ్లికొడుకే కాల్చి చంపాడు..

అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న పెళ్లి వేడుక‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. బ‌రాత్ వేడుక‌లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న‌ పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి త‌గిలింది. దీంతో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్ర‌హ్మ‌న‌గ‌ర్ ఏరియాలో చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మనీష్‌ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్‌ స్నేహితుడు బాబూ లాల్‌ యాదవ్‌ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్‌నే మనీష్‌ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్‌.

What would happen if you shot a gun in space? | BBC Science Focus Magazine

అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్‌.. గన్‌ను కిందకు దించగానే ట్రిగ్గర్‌ నొక్కుకుపోయి బుల్లెట్‌ బాబూ లాల్‌ శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్‌ మేదషియాను అరెస్ట్‌ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.