BRS కు మరో షాక్.. బిజెపిలోకి వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ?

-

former Warangal East MLA Nannapuneni Narendra: త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో కీలక నేతలందరూ ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీని వీడి చాలామంది నేతలు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలోనే గులాబీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది.

former Warangal East MLA Nannapuneni Narendra

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నాపునేని నరేందర్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. నరేందర్… త్వరలోనే బిజెపి పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు అన్ని చర్చలు బిజెపి నేతలతో జరిగినట్లు సమాచారం అందుతుంది. అన్ని ఓకే అయితే ఈనెల 16వ తేదీన బిజెపి పార్టీలో చేరతారట నరేందర్. కాగా మొన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు నరేందర్. కాగా ఇటీవల గులాబీ పార్టీ నుంచి బిజెపిలో చేరిన ఆరూరి రమేష్ కు బిజెపి ఎంపీ టికెట్ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news