ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసు పై ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈడీ విచారించి.. హైకోర్టు కి నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రేపు కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందో అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో నిర్వహిచిన చిట్ చాట్ లో మాట్లాడారు కేటీఆర్. “ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ రెడ్డికి ఏమి దొరకటం లేదు. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. నాపై కేసు పెడితే.. రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు.