తెలంగాణలో నేడు నాలుగు రైలు సర్వీసులు ప్రారంభం

-

దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలో నాలుగు రైలు సర్వీసులను పొడిగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పొడిగించిన ఈ రైలు సర్వీసులను ఇవాళ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఉపసభాపతి పద్మారావు, రైల్వే అధికారులు పాల్గొననున్నారు. హడప్సర్- హైదరాబాద్ ఎక్స్‌ ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్-కాచిగూడ  ఎక్స్‌ప్రెస్ కర్నూలు సిటీ వరకు, నాందేడ్- తాండూరు ఎక్స్‌ ప్రెస్ రాయచూర్ వరకు, కరీంనగర్ – నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను బోధన్ వరకు పొడిగించారు. పొడిగించిన అన్ని సర్వీసులకు బుకింగ్‌లు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలియజేసింది.

నేటి నుంచి పొడిగించిన 17014/17013 కాజీపేట రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. మరోవైపు ఈరోజు నుంచి పుణె(హదాప్సర్‌)-కాజీపేట-పుణె(హదాప్సర్‌) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరనుంది. ఇప్పటివరకు ఈ రైలు హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి వెళ్లగా.. ఇక నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వెళుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news