ప్రజలందరికీ ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ – KCR

-

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు లోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ చేపట్టాలని సిఎస్ శాంతి కుమారిని తాను కోరుతున్నారని అన్నారు. ఏడేళ్ల హరితహారం లో భాగంగా ఇప్పటివరకు 273.33 కోట్ల మొక్కలు నాటామన్నారు.

ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు రూ. 10, 822 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని, ఆర్థిక పరపతి, తలసరి ఆదాయంలోనూ అగ్రగామిగా ఉందన్నారు. అత్యధిక ధాన్యాల ఉత్పత్తి, 24 గంటలు విద్యుత్ అందించే విషయంలో, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు అందించడంతోపాటు 100% ఓడిఎఫ్ సాధించిన విషయంలోనూ తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయంలో తనకు ఎలాంటి డౌట్ లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news