తెలంగాణ ముస్లింలకు గుడ్‌ న్యూస్‌… ధోబీఘాట్లు, సెలూన్లకూ ఉచిత విద్యుత్తు

-

కెసిఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు శుభవార్త చెబుతూ సీఎం కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం మరియు సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ ఎంపీ ఓవైసీ నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మైనారిటీ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.అయితే.. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సీరియస్‌ అయ్యారు. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని.. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయని మండిపడ్డారు. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? ఈ నయా నిజాం కు మత పిచ్చి ఎక్కువైంది. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజం లో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news