తెలంగాణ లో ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తరలిచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను బాట సింగారానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తరలింపు నిర్ణయం పై గడ్డి అన్నారం మార్కెట్ వ్యాపారులు వ్యతిరేకించారు. అంతే కాకుండా హై కోర్టు ను ఆశ్ర యించారు. అయితే ఈ అంశం పై తెంలంగాణ హై కోర్టు స్పందించి తరలింపు పై స్టే విధించింది.
దీంతో హై కోర్టు విధించిన స్టే ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. హై కోర్టు విడుదల చేసిన ఉత్తర్వులనే సవరించాలని కోరుతామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టు కు తెలిపింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గడ్డి అన్నారం మార్కెట్ ను తరలించే యోచన లో లేదని తెలుస్తుంది. దానికి కారణం తెలంగాణ లో రోజు రోజు కు టీఆర్ ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యవహారాలు పెట్టు కోవద్దని టీఆర్ఎస్ పెద్దలు అనుకున్నారని సమాచారం. అందుకే సుప్రీం కోర్టు లో ఉన్న పిటిషన్ వెనక్కి తీసుకున్నారని సమాచారం.