కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కొన్ని రోజులుగా అందరూ అనుకున్నట్లుగానే… కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి….కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపు మరో నలుగురు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
కాగా, ఇప్పటికే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులతో వెల్లడించారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య సహా పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.