హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చెప్పింది చేసి తీరుతాం : మంత్రి కొండా సురేఖ

-

తెలంగాణలో రుణమాఫీ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావుకు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరూ సవాల్ విసురుకున్నారు. ముఖ్యంగా ఆగస్ట్ 15 లోపు కాంగ్రెస్ సర్కార్ రైతులకు హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ పై తాజాగా మంత్రి కొండా సురేఖ స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హమీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 లోగా రుణ మాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సర్కార్ చెప్పింది చేసి తీరుతుందని.. రాజీనామా చేసేందుకు హరీష్ రావు కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రులకు అధికారాలే లేవని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సకాలంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తామని స్వీట్ న్యూస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news