హైదరాబాద్ మహానగరంలో సినిమాలకు అలాగే షాపింగ్ వెళ్లే వారి కోసం అదిరిపోయే శుభవార్త చెప్పారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి. హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి. ఈ సందర్భంగా కొన్ని థియేటర్లు అలాగే.. షాపింగ్ మాల్స్ బలవంతంగా పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారని… జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి దృష్టికి వచ్చింది.
అయితే దీనిపైన.. తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి. కూకట్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు సికింద్రాబాద్ ప్రాంతాలలో ఉన్న థియేటర్లలో అక్రమ పార్కింగ్ వసూలు చేస్తున్నట్లు… బయటపడటంతో.. ఆమె సీరియస్ కావడం జరిగింది. అలాగే థియేటర్లలో నాసిరకం ఫుడ్స్ పెడుతున్నారని కూడా… కొన్ని థియేటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇకపై వాహనదారుల నుంచి పార్కింగ్ పీస్ తీసుకుంటే చర్యలు తీసుకుంటామని థియేటర్లకు అలాగే షాపింగ్ మాల్స్ ఓనర్స్కో హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రీగా పార్కింగ్ కల్పించాలన్నారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి.