ఎంసెట్​లోనూ బాలికలదే హవా : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

-

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే హవా నడిచింది. ఇంజినీరింగ్​లో బాలికలు 82 శాతం.. బాలురు 79 శాతం ఉత్తీర్ణత పొందారు. అగ్రికల్చర్​లో బాలికలు 87 శాతం.. బాలురు 84 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లోనే బాలికలే పైచేయి సాధించారు.

అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షలు, ఫలితాల విడుదలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికే ఫలితాలు ఇచ్చామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించామని చెప్పారు. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షకు 1,95,275 మంది.. అగ్రికల్చర్‌, మెడికల్ విభాగాల్లో పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news