కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. పొంగులేటి ఒక్కసారి ఎంపి అయినా లక్షలాదిమంది గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని వివరించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం అని.. రేవంత్ రెడ్డి తాను మాట్లాడుకుంటామని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా కలిసే ఉంటామని పేర్కొన్నారు.