కామెడీ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గాలోడు, జూన్ 25న ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు, మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 21 జూన్: ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో సరికొత్త సినిమాతో రాబోతోంది. టెలివిజన్ స్టార్ సుధీర్ నటించిన గాలోడు సినిమాని ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేస్తోంది. టెలివిజన్ స్టార్ సుధీర్ హీరోగా నటించిన కామెడీ అండ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను మెప్పించిన గాలోడు, జూన్ 25న ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మీ జీ తెలుగులో!

Watch Gaalodu Telugu Full Movie Online in HD Quality - Download Now

రజనీకాంత్ (సుధీర్) ఏ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా గాలోడిలా తిరుగుతుంటాడు. పేకాట ఆడుతుంటే జరిగిన గొడవలో ఆ గ్రామ సర్పంచ్ కొడుకును చంపి ఊరి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వస్తాడు. సిటీకి వచ్చిన రజనీకాంత్ బిచ్చగాళ్ల వద్ద డబ్బు కొట్టేస్తూ, గుళ్లో ప్రసాదం తినుకుంటూ గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కు శుక్ల (గెహనా సిప్పీ) పరిచయం అవుతుంది. రజనీకాంత్ పరిస్థితి చూసిన శుక్ల తన ఇంట్లోనే డ్రైవర్ గా ఉద్యోగం ఇస్తుంది. తర్వాత రజనీకాంత్ ను లవ్ చేస్తుంది. ప్రపోజ్ చేస్తే రజనీకాంత్ ఒప్పుకోడు. ఇంతలోనే రజనీకాంత్ ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రజనీకాంత్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మరి రజనీకాంత్.. శుక్ల ప్రేమను ఒప్పుకున్నాడా? వారిద్దరి ప్రేమ గెలిచిందా? పెళ్లి చేసుకున్నారా? అనే తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Gaalodu Movie Review: Sudigali Sudheer shines in this mass entertainer
రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్, గెహ్నా సిప్పీ ప్రధాన పాత్రలు పోషించగా, పృథ్వీ రాజ్, సత్య కృష్ణన్, సప్తగిరి, షకలక శంకర్ ఇతర పాత్రల్లో నటించారు.

తొలి ప్రయత్నంలోనే హీరోగా ప్రేక్షకులను మెప్పించిన సుధీర్ నటించిన గాలోడు, ఈ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు, మీ జీ తెలుగులో, తప్పక చూడండి!

Read more RELATED
Recommended to you

Latest news