పీసీసీ చీఫ్ పదవీ మహేష్ గౌడ్ కి ఇవ్వడం గర్వకారణం : డిప్యూటీ సీఎం భట్టి

-

పీసీసీ చీఫ్ పదవీ బీసీకి చెందిన బొమ్మ  మహేష్ కుమార్ గౌడ్ కి ఇవ్వడం గర్వకారణం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరా భవన్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మల్లికార్జున ఖర్గే నియమించినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. వారు తీసుకునే బాధ్యతలు లక్షలాది మంది కార్యకర్తల పనితనాన్ని వారి శ్రమను గౌరవిస్తూ.. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటున్న పాలన కార్యక్రమాన్ని వాడవాడకు చేపట్టాలని కోరుతున్నాను. పది సంవత్సరాలు లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

అనేక అవమానాలు ఎదుర్కొని జెండాలు మోసి ఇబ్బంది పడ్డవారందరికీ  హృదయ పూర్వకంగా దన్యవాదాలు తెలిపారు.  పార్టీని మహేష్ గౌడ్ మరింత బలోపేతం చేయాలి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఇవ్వడం గర్వకారణం అన్నారు. అనేక పోరాటాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టమని పేర్కొన్నారు. కేవలం పార్టీ అధ్యక్షుడినే కాదు.. అనుబంధ సంస్థల్లో కూడా కష్టపడి పని చేసే వారికి పదవులు దక్కుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version