త్వరలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ : కిషన్ రెడ్డి

-

దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వెళుతుండడంతో విదేశాల నుంచి వచ్చే పర్యటకుల సంఖ్య పెరిగిందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాదులో మాదాపూర్ లో ఐస్టీసీ కోహినూర్ హోటల్లో దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.


పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని నెలకొల్పనున్నట్టు వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధితో లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మెకు నిర్వహించబోతున్నాం అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెల్లడించారు. సదస్సులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళ నాడు, కర్ణాటక, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version