ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ అనే పేరుతో నిర్వహించిన సదస్సును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల ప్రారంభించారు. కార్యక్రమంలో అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకు సర్కార్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో రైస్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంది. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వరి ఉత్పత్తి అనేది క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతేడాది రాష్ట్రంలో 1.2 కోట్ల ఎకరాల్లో 26 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ఉత్పత్తుల ఎగుమతులు అంతర్జాతీయంగా విస్తరిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రచంచ వ్యాప్తంగా వాణిజ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. గతేడాది 26 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తోంది.