హమ్మయ్య తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్ లో ఎంతంటే ?

-

Gold Rates : మహిళలకు గుడ్‌ న్యూస్‌. ఇండియాలో భారీగా బంగారం పెరుగుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్ అందింది. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on Febuary 28th

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 62, 830 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 57, 590 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 75, 400 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news