ఒకటి కంటే ఎక్కువ లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ రాజీనామా చేస్తారా…? : బాల్క సుమన్

-

రేవంత్ పేరు చెప్తే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ అన్నారని గుర్తు చేసిన సీఎం రేవంత్.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటయినా గెలిచి చూపించాలని చేవెళ్ల వేదికగా ఛాలెంజ్ విసిరారు. “రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పుకుని పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు అని అన్నారు.

ఇదిలా ఉంటే….చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వీకరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…..ఒకటి కంటే ఎక్కువ లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని ఎదురు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని ,కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలకి అసలు విషయం అర్థం అయిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఎందుకు ఓడించామా? అని ప్రజల్లో బాధ మొదలైందని ,వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు. ఒకటి కాదని.. మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని బాల్క సుమన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news