లెప్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెడ్ లైన్ దాటి పోవడంతో పోటీ చేసే స్థానాలపై లిస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నిన్న భట్టి విక్రమార్క ఫోన్ చేసి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. కానీ ఇప్పటివరకు పొత్తు గురించి ప్రస్తావించకపోవడంతో సీపీఎం కాంగ్రెస్ తెగదెంపులు చేసుకుంటున్నట్టు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్నీ అవమానించింది.
ఆ పార్టీ నేతలు పొత్తులపై తలో మాట మాట్లాడుతున్నారు. అధిష్టానంతో మాట్లాడిన తరువాత ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని హేళన చేస్తున్నారు. అందుకే 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 17 స్థానాలను ప్రకటించింది సీపీఎం. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధి, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, నకిరెకల్, భువనగిరి, హుజూర్ నగర్, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.