బుల్లెట్ బైక్‌ నడుపుకుంటూ అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజాసింగ్

-

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. అసెంబ్లీకి బుల్లెట్ పై వచ్చారు. కొంతకాలంగా తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమస్య పైన అనేకసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తన వాహనం మార్చాలని అభ్యర్థించారు. రాజాసింగ్ కు కేటాయించిన వాహనం మూడుసార్లు ఆగిపోయి మొండికేసిన తనకు కొత్త వాహనం కేటాయించడం లేదని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ ను కోరడానికి శుక్రవారం రాజాసింగ్ ప్రగతి భవన్ కు వెళ్లారు, ఆందోళనకు దిగారు. అక్కడే కారు వదిలేసి వెళ్లడంతో పోలీసులు దానిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇదే క్రమంలో రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళుతున్న సమయంలో కారు టైరు ఊడిపోయింది. గతంలో పలుమార్లు కూడా వాహనం ఇబ్బంది పెట్టింది. తనకు కొత్త వాహనం కేటాయించడం లేదని అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు రాజాసింగ్ తెలిపారు. అసెంబ్లీకి తన బుల్లెట్ బండిపై దర్జాగా వచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news