బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు మాయాజాలం సృష్టించారు. టాస్గరికి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ కేవలం 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ 400 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 223 పరుగుల ఆదిక్యంలోకి వచ్చింది భారత్. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత స్పిన్నర్లు 91 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. దీంతో భారత్ 132 పరుగుల తేడాతో తొలి టెస్ట్ లో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు.. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 2, షమీ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.