తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగ అవకాశాలు..

-

తెలంగాణ నిరుద్యోగులకు, విద్యార్థులకు సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది..ఇప్పటికే పలు శాఖ లలో ఉన్న ఖాలీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది..పలు సంస్థలలో ఉద్యొగాల భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా వైద్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసెందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ప్రభుత్వానికి చెందిన మేడ్చల్,మల్కాజ్ గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి మెడికల్ ఆఫీసర్లు 18 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటుగా, టీఎస్,ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ నర్సు ఖాళీలు 18 ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ జీఎన్ ఎం ఉత్తీర్ణతతోపాటు, టీఎస్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా 500 రూ చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేది జూన్ 6, 2022గా నిర్ణయించారు.. ఇకపోతే చివరగా ఈ దరఖాస్తులను

పంపించాల్సిన చిరునామా:

డీఎంహెచ్ ఓ,

బీ బ్లాక్,

మొదటి అంతస్తు,

కలెక్టర్ కాంప్లెక్స్,

కీసర, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా..

Read more RELATED
Recommended to you

Latest news