ప్రభుత్వం ఆర్టీసీని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోంది: ఈటెల రాజేందర్

-

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. 2014 నాటికి 11 వేల 200 బస్సులు ఉంటే ఇప్పుడు 9 వేల 600 కు తగ్గించారని, సిబ్బంది సంఖ్య 56 వేల నుంచి 49 వేలకు పడిపోయిందని తెలిపారు. కొన్ని డిపోలను కూడా ఎత్తివేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు ఈటెల. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు నేడు అన్నమో రామచంద్రా అని ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

పని ఒత్తిడి భారం భరించలేక అనేక మంది చనిపోతున్నారని తెలిపారు. ఒక బస్సు ఒక రూటులో వెళ్ళినప్పుడు కలెక్షన్లు కాకపోతే డిజిల్ కన్వెన్షన్ ఎక్కువగా ఉందని చెప్పి నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తోంది అన్నారు ఈటెల. కార్మికుల కళ్ళల్లో మట్టి కొడుతున్న వ్యక్తి కేసీఆర్, మంత్రివర్గ సహచరులు అని విమర్శించారు.ఆర్టీసీలో లాభనష్టాలు చూడొద్దని హితవు పలికారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

Read more RELATED
Recommended to you

Latest news