అవినీతికి అడ్రస్‌గా మారిన ప్రభుత్వ అధికారులు.. ?

-

లోకంలో అవినీతి రోజు రోజుకు ఎక్కువైపోతుంది.. ప్రభుత్వం వారు ఇచ్చే జీతాలు సరిపోకనా, హద్దులేని కోరికలు తీర్చుకోవడానికా.. వీరంత లంచాలు ఎందుకు తీసుకుంటున్నట్లు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు.. ఒక మనిషికి కావలసింది మూడుపూటలా తిండి. దీనితో తృప్తిపడక అడ్డదార్లు వెతుకుతున్నారు బాధ్యతగల వృత్తిలో ఉంటూ కొందరు.. ఎవరిని అడిగినా ఇలా అవినీతికి అడ్డాగా మారిన వాటిలో రెవెన్యూ, పోలీస్ డిపార్ట్‌మెంట్లు మొదటిస్దానంలో ఉంటాయంటారు.. అది నిజమని నిరూపించారు ఈ ప్రభుత్వ అధికారులు.. ఈ అవినీతి స్టోరీ ఏంటో తెలుసుకుంటే..

హైదరాబాద్ షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రూ. 15 లక్షల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. అంతే కాదు ఈ కేసులో బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ కూడా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను కూడా పట్టుకుని విచారిస్తున్నారు. ఇకపోతే బంజారాహిల్స్‌లోని కోట్ల విలువైన ఎకరంన్నర స్థల వివాదాన్ని పరిష్కరించడానికి వీరు లంచావతరం ఎత్తినట్లు తేలింది..

 

ఈ ల్యాండ్ విషయంలో దీని యజమాని వ్యక్తి కోర్టులో దావా వేయగా, ఆ స్థలం అతనికే చెందుతుందని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో సయ్యద్ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోగా, రెవెన్యూ శాఖ అతనిపై కేసు పెట్టింది. ఈ దశలో ఆర్‌ఐ నాగార్జున, ఎస్‌ఐ రవీందర్‌ లు కుమ్ముక్కై సెటిల్మెంట్ కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని అడగడంతో సయ్యద్ ఏసీబీకి సమాచారం ఇవ్వగా వారు చెప్పిన ప్రకారం నాగార్జున లంచం కింద అడ్వాన్సుగా రూ.15 లక్షలు పుచ్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట, ఇక ఎస్ఐ రవీందర్ ను కూడా విచారిస్తున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news