BREAKING : బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్న గవర్నర్ తమిళి సై

గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర్య రాజన్ మధ్య గ్యాప్ నెలకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా తెలంగాణ గవర్నర్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీ కి వెళ్లారు తెలంగాణ గవర్నర్. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు రైలులో ప్రయాణించిన గవర్నర్… నిజామాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఐటి కి చేరుకున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కు స్వాగతం పలకాల్సిన జిల్లా కలెక్టర్ ముష్రాఫ్ అలీ అలాగే జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ డుమ్మా కొట్టారు. ఇన్చార్జ్ బీసీ వెంకటరమణ ఇతరులు తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికారు. బాసర త్రిబుల్ ఐటీ కి వచ్చిన గవర్నర్ ఉదయం 6 గంటల సమయంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ కి వచ్చి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు గవర్నర్. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి అనంతరం వారితో మాట్లాడారు గవర్నర్ తమిలి సై సౌందర్య రాజన్.