వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్.. రైల్వే జీఎంకు మంత్రి పొంగులేటి రిక్వెస్ట్..!

-

వరంగల్ అభివృద్ధి పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రైల్వే మార్గంలోని అలైన్ మెంట్ లోని కొన్ని మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నూతన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బ తింటుందని పేర్కొన్నారు. 

వరంగల్ అభివృద్ధి దృష్ట్యా అలైన్ మెంట్ మార్చాలని రిక్వెస్ట్ చేసారు. మరోవైపు తెలంగాణలోని ప్రధాన నగరాల అభివృద్ధి పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయం విధితమే. భవిష్యత్ అవసరాలు, ప్రణాళికల్లో భాగంగా నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు తోడుగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల లో నాలుగో నగరం నిర్మించనున్నట్టు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో ప్రధాన నగరం అయిన వరంగల్ అభివృద్ధి పై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలోనే మంత్రి పొంగులేటి దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిశారు. 

Read more RELATED
Recommended to you

Latest news