MBBSలో ప్ర‌వేశాల కోసం త‌మిళ‌నాడు మాదిరి రూల్స్ తీసుకురండి : హ‌రీశ్‌రావు

-

తెలంగాణకు చెందిన విద్యార్థులు కొంత మంది కొత్త నిబంధనల వల్ల ఎంబీబీఎస్ లో సీటు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. లోకల్ అయినప్పటికీ వారు నాన్ లోకల్ కిందికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్ కి ముందు విద్యాసంవత్సరం నుంచి వెనక్కి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అని కొత్త జీవోలో పేర్కొన్నారు. ఏడేళ్లలో నాలుగు ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడ అని పాత నిబంధన చెబుతోంది. ఏడేళ్లు తీసేసి నాలుగేళ్లు అంటుంది అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఇంటర్ రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే.. లాంగ్ టర్మ్ కోచింగ్ కి వెళ్తే నాన్ లోకల్ కారా..? అని ప్రశ్నించారు. తమిళనాడులో మాదిరిగా తెలంగాణలో రూల్స్ తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు హరీశ్ రావు. అలాగే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వాటి నిబంధనలున్నాయి. తెలంగాణకు కూడా సొంత రూల్స్ కావాలన్నారు. చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేసి విధానం రూపొందిస్తే.. అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకత్వం అవుతుందన్నారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news