తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 3 దశల్లో గృహలక్ష్మి డబ్బులు జమ

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్..  గృహలక్ష్మి పథకానికి ఎంపికైన దరఖాస్తుదారులకు 3 దశల్లో రూ. 3లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.

Gruha Lakshmi money will be deposited in 3 stages
Gruha Lakshmi money will be deposited in 3 stages

త్వరలోనే ఒక్కో నియోజకవర్గానికి 3000 మంది చొప్పున మొత్తం 3,65,975 మంది లబ్దిదారులను గుర్తించి, మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. 35,000 మందికి సీఎం కోటా కింద మంజూరు చేయనున్నట్టు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ  రాష్ట్రంలో దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలో 45 నియోజక వర్గాల్లో నిర్నిత సంఖ్యలో లబ్ధిదారుల జాబితాలో సిద్ధమయ్యాయని పేర్కొంది. రెండో విడతలో హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1100 కుటుంబాల చొప్పున ఈ దళిత బంధు రెండో విడత పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news