తెలంగాణ రాష్ట్రం లో అమలు అవతున్న మధ్యాహ్న భోజనం పై రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యా శాఖ అదేశించింది. అలాగే ప్రతి పాఠశాలలో వండిన భోజనాన్ని ప్రిన్సిపల్ గానీ టీచర్ గానీ రుచి చూసిన తర్వతే పిల్లలకు అందించాలని ఆదేశించింది. అలాగే ప్రతి రోజు కూడా రిజస్టర్ల లో నమోదు చేయాలని కూడా సూచించింది.
అలాగే ప్రతి స్కూల్ లో గోడ మెనూ ను రాయాలని సూచించింది. అలాగే మధ్యాహ్న భోజన పథకం వివరాలను కూడా గోడ పై రాయాలని సూచించింది. మెనూ ప్రకా రమే భోజనాలు చేయాలని తెలిపింది. అలాగే వారానికి మూడు గుడ్ల ను విద్యార్థులకు అందించాలని సూచించింది. ముఖ్యం గా విద్యార్థులకు వేడి గా ఉండే ఆహారాన్ని మాత్రమే అందించాలని ఆదేశించింది. భోజనం విషయం లో నాణ్యత లేకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుం టామని తెలిపింది.