దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 10 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. ఇది సంతోషకర విషయం. అయితే ఇలా నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కరోనా కేసులతో కేరళ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది.
తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ చర్యలకు సహకరించని వారికి ఉచిత వైద్యం అందిచబోమని కేరళ సీఎం విజయన్ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇకపై ఉచిత వైద్యం ఉండబోదని స్ఫష్టం చేశారు. వారి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించదని వెల్లడించారు. కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారిని.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం నిలిపివేస్తామని సీఎం హెచ్చిరించారు. అయితే ఆరోగ్య పరిస్థితులు, ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఈ విషయాన్ని నిర్థారించేలా డాక్టర్ల దగ్గర నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాని ఆయన అన్నరు. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోని ఫలితాలను ప్రభుత్వానికి సమర్పించాలని.. వాటి ఖర్చను ఆయా వ్యక్తులే భరించాలని తేల్చి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి, ప్రజలతో మమేకమయ్యే వారికి ఇది వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.