తెలంగాణలో గురుకుల పరీక్షలను ఆగస్టు 01వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వీటి పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ను ఆగస్టు 23వ తేదీన విడుదల చేసారు. ఆగస్టు 03 నుంచి ఆగస్టు 19 వరకు నిర్వహించిన వివిధ విభాగాల పరీక్షలకు సంబంధించి అబ్జెక్షన్స్ కు చివరి తేదీ ఆగస్టు 25తో ముగిసింది. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కీని ఆగస్టు 24న విడుదల చేయగా.. వీటి అబ్జెక్షన్స్ కు ఆగస్టు 26వరకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. అత్యంత వేగంగా గురుకుల పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.
తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్ష లను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తర్వాత వారం రోజులకు సీబీఆర్‌టీ పరీక్షల తుది కీ విడుదల చేసింది. ఆగస్టు 31న గురుకుల డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించి ఫైనల్ కీని విడుదల చేయగా.. సెప్టెంబర్ 01న జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాలకు నిర్వహించిన ఫైనల్ కీని విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. డీగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కు సంబంధించి.. ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను డెమోకు పిలువాలని గురుకుల నియామక బోర్డు యోచిస్తున్నది.