రెండు కళ్లు, చెవులే కాదు.. రెండు నాలుకలు కూడా ఉన్న మనిషిని చూశారా..?

-

మనిషికి రెండు కళ్లు, చెవులు, చేతులు ఉంటాయి.. కేవలం మనిషికే కాదు.. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఇవి రెండే ఉంటాయి. కానీ నాలుక మాత్రం ఒకటే ఉంటుంది కదా.! రెండు నాలుకలు ఉన్న మనిషిని మీరెప్పుడైనా చూశారు..? నిజంగా రెండు నాలుకలు ఉన్న మహిళ ఉంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో టిక్ క్లోలో తన రెండు నాలుకలను బయటకు లాగుతున్నట్లు చూపించే వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రెండు వేర్వేరు గ్లాసుల్లో.. కూల్‌డ్రింక్స్‌ను తన రెండు నాలుకలతో తాగుతుంది. ఇది చూడ్డానికే ఘోరంగా ఉంది. ఆమెకు క్లియర్‌గా రెండు నాలుకలు ఉన్నట్లు తెలుస్తుంది. నాలుకను రెండు ముక్కలు చేసే ప్రక్రియ తాను ఊహించిన దానికంటే సులభమైందని, కేవలం 15 నిమిషాల సమయం పట్టిందని యువతి తెలిపింది. శస్త్రచికిత్స తర్వాత, ఆమె నోటి నుండి లాలాజలం ఎక్కువగా వచ్చిందట. నొప్పి, వాపు తగ్గడానికి 24 గంటలు పట్టిందని ఆ యువతి పేర్కొంది. కానీ రెండు నాలుకలూ పళ్లు లాగుతున్నట్టు అనిపిస్తోందని చెప్పింది. తినడానికి లేదా త్రాగడానికి ఏమీ ఇబ్బంది లేదని ఆమె తన వింత గోళాన్ని వివరించింది.

ఆమె నాలుకతోనే తన శరీరం మొత్తం మీద టాటూలు వేయించుకుంది. చూడ్డానికి చాలా వింతంగా ఉంది. దేవుడు ఇచ్చిన శరీరాన్ని మొత్తం మార్చేసింది. ఫ్యాషన్‌ పిచ్చిలో పడి జనాలు ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. orylan1999 అనే పేరుతో తనకు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 124k ఫాలోవర్స్‌ ఉన్నారు. కేవలం 125 పోస్టులకే అంత మంది ఫాలోవర్స్‌ వచ్చారంటే.. ఆమె వీడియోలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మీరే ఆలోచించండి.

 

View this post on Instagram

 

A post shared by Orylan (@orylan1999)

Read more RELATED
Recommended to you

Latest news